Thursday, April 18, 2013

అవిశ్రాంతంగా సాగాల్సిందే!


సముద్ర కెరటాలపైన
నిరంతర చలన ముద్రలు 
చైతన్యానికి ప్రతీకలై
ఫ్రెస్కో ఆర్టు లాగా!   

జీవన నిర్భీక ప్రయాణం  
అవిశ్రాంతంగా సాగాల్సిందే!

ఆ కడలి అలలపైన
తేలాడే వెన్నెలలా! 

అలా అలా అలా...
అలాగే...
ఆలాగుననే... 

*******************,

Hamsini  (Link - my "POETRY")

అవిశ్రాంతంగా సాగాల్సిందే!
కాదంబరి,  Apr 03, 2013






















Girl In Rain  Stock Photos and Images (Link for photo)
00051797; konamanini Views
;

Saturday, April 13, 2013

మాధుర్య తూకము


సరసు తరగల తీవియలపై
గగన నీలిమల "స'రాగాలు' "
నా అంతరంగం -
సహస్ర దళ నళినమై
విరబూయు చున్నది,

ప్రియ సఖీ!
హృదయమున్నది మనిషికేగా!
కలలు, కల్లలు ఎడదకేగా!

కొలను ఒడ్డున కాస్త సేపు
ఆసీనులయ్యీ గడిపితే;
కలత దీరును కాస్తసేపు;
మరి,
ఆ కొన్ని క్షణాల
తీపిదనపు తూకమెంతో తెలుపగలవా!?
ఆ కొన్ని నిముషమ్ముల
కొలత ఎంతో చెప్పగలవా!!? నేస్తమా!

కలవరమ్ముల నపనయించే లిప్తపాటులు-
కలకండల మాధుర్యాల అంత!
యోచనేల?
వాని నిడివి
రోదసీ దిశాంతముల కొసల వరకూ
వాని కొలతలు!

అట్టి - నిమేషమ్ముల
నీరజముల చూపు తూపుల
సరోవరము వీక్షించుచున్నది
చోద్య, విడ్డూరమ్ముగాన్!
తాను -
అనిమేషయై సరసమ్ముగాను -
దేవ గణములనే
కికురించుచున్నది, చూడుమా!  

    (రచన:-  కాదంబరి )



మాధుర్య తూకము: Link = Neelahamsa

 2013/03/30  "కొలను" పై కాదంబరి గారి కవిత ! -3


















Cloud 9 talks: photo curtecy: 

***********;