Tuesday, June 16, 2015

బొడ్రాయి = నాభిశిల

వాస్తు శాస్త్రంలో నాభిశిల (नाभि (शिला) కు ప్రాధాన్యత ఉన్నది.
నాభి సంస్కృత పదానికి - బొడ్డు  అని అర్ధం. 
"బొడ్రాయి" అని తెలుగు పదం. చాలాగ్రామాలలో, బొడ్రాయి అనే మాటను, 
నేడు కూడా వాడుతున్నారు.
గర్భవతికి, కడుపులోని బిడ్డకూ అనుబంధంగా బొడ్డుత్రాడు ఉంటుంది.
నాభి - ప్రాణసంకేతం.
శంకుస్థాపన, గృహ ప్రవేశ వేళలలో, నాభిశిల స్థాపన ముఖ్య పరిశీలన అంశం. .
కేతేపల్లి (సువర్ణగిరి - ఈ పల్లెకు ప్రాచీన నామం. - నల్గొండ జిల్లా), 
బోగారం మొదలైన గ్రామాలలో
గ్రామదేవత పండుగగా స్థానికంగా అనేక పల్లెలందున పండుగను జరుపుకుంటారు.
"బొడ్రాయి పండుగ" ను తెలంగాణా ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు.
కుమార్తెలను పుట్టినింటికి పిలుస్తారు. కూతుళ్ళకు కానుకలను ఇస్తారు.
శాఖాహారాది సూత్రాలను పట్టింపుగా అనుసరిస్తారు.
నాభి శిల ; శ్రీపర్ణి వాస్తు శాస్త్రాదులందు వాస్తు రీత్యా,
 "జీవికి నాభి వలె, కోవెలలు, భవన, గృహ నిర్మాణాదులందు 
నాభిశిల గురించి ప్రస్తావన చేస్తారు.
శ్రీకూర్మ శిల, మత్స్య యంత్రం మొదలగు యంత్రములు సైతం 
అనుబంధంగా విశిష్ట స్థానాన్ని కలిగిఉన్నవి.

******************************

నేపాల్ లోని కాళీగండకీ నది సాలగ్రామములకు ప్రసిద్ధి.
గండకీ నదిలోని సాలగ్రామములు, కూర్మశిలలు ప్రకృతిసిద్ధమైనవి.
శ్రీ మహావిష్ణు మూర్తికి ప్రీతిపాత్రమైనవి సాలగ్రామములు.
నేపాల్ దేశంలో గండకీ నదీ తీరమున విష్ణుమూర్తికి ప్రతిరూపముగా
"సాలిగ్రామ్" అని ఒక గ్రామము ఉన్నది.
సాలంకాయన మహర్షి ఒక పర్ణశాలలో నివసిస్తూ,
శ్రీ మహావిష్ణువును 'వనరూపి విష్ణువు' రూపమున 
సాలవృక్షమున పూజలు చేసాడు. 

******************************

అప్పటి నుండి ఆ కుగ్రామానికి 'సాలగామ్' అనే నామం వచ్చినది.  

శ్రీ వైష్ణవులు కఠిన నిష్ఠతో సాలగ్రామమును 
పూజామందిరములలో ఉంచి, ఆరాధిస్తూ ఉంటారు.
వరాహపురాణము, స్కందపురాణము, ఆపస్తంబుడు విధించిన సూత్రములు, 
తులసీ కథ, సాలగ్రామ భావన యొక్క ప్రాచీనతకు ఋజువులు. 
క్రీస్తు పూర్వము నాటిది ఈ "సాలగ్రామ పూజ".
"ఆది విష్ణు పంచాయతనము" విశిష్టత కలిగిన పూజా విధానం.

******************************


 clouds  










అఖిలవనిత
Pageview chart 31399 pageviews - 785 posts, last published on Jun 12, 2015 - 1 comment awaiting moderation
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 58763 pageviews - 1017 posts, last published on May 2, 2015 - 7 followers
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 4387 pageviews - 126 posts, last published on Jan 14, 2015

No comments:

Post a Comment