Tuesday, September 15, 2015

సంగీత ఆరాధనము:

ఉట్టిమీద పాలు పెరుగు; 
వెన్న పాలు, మీగడలు; 
ఇట్టె మాయమయ్యేను;
మటుమాయం ఔతూంటే 
ఏమి చేస్తుమమ్మా, 
మేమేమి సేయగలమమ్మా!?” 
యశోదమ్మ! చెప్పవమ్మ ||
;
కట్టుదిట్టంగా నీ పెంపకముంటేను; 
నట్టింటను నీ ఇంట్లో కుదురుగాను ఉంటేను;
ఊరి వారలందరము నిన్నిట్లు రట్టడి సేగలిగేరా!?” 
రోషముతో యశోదమ్మ ; 
చిన్ని కన్నయ్యను అదుపులోన పెట్టింది!

@@@@@@@@@@@@@@

పల్లీయులు, భామినులు
అందరికీ తోచదాయె!
తప్పు తెలిసివచ్చింది 
కట్టడిలో ఉంచేను తల్లి యశోదమ్మ! 
స్వాతిచిప్ప ముత్తెంలా 
లోగిట్లో క్రిష్ణమ్మ
అమ్మకొంగు మెలిపెడుతూ 
బుద్ధిగ తానున్నాడు ||
కన్నయ్య కనబడని; 
కంటిచూపు చూపేనా?
కిట్టమ్మ అగుపడితే: 
బాధలన్ని మటుమాయం; 
శోధనలు మటుమాయం;
దిట్టమైన కట్టుబాటు లెటుల 
ఇటుల మితిమీరి; 
అమ్మా! ఓ యశోదమ్మ!
మా ఎల్లరి మానసముల; 
ఆనందం ఆవిరాయె! అమ్మా! ఓ యశోదమ్మ!
అల్లరి అని పేరే, మరి 
కానీ, ఆ అల్లరి మురిపెమే!
అల్లరి అని పేరేను కాని
పేర్మి జ్ఞానగీతయే!
అల్లరి అని పేరైనా, అది గీతాసారమే!
రాధ ప్రేమ వోలె - బాలుని అల్లరికి
మురళీ రవళీ సంగీతారాధనమే!
తెలుసుకొంటిమమ్మా! 
అమ్మా! ఓ యశోదమ్మ!
ఆస్యమున విశ్వ, గోళములు
చూపిన శ్రీ బాలక్రిష్ణ మూరితిని;

**************************************** ********
[రచన:- కుసుమాంబ1955]
Kusuma Piduri ,to  - ‎భావుక ; August 28 at 9:46am · 

No comments:

Post a Comment