Monday, October 12, 2015

బాలకృష్ణుని దాగుడుమూతలు

ఆ కడ, ఈ కడ ఏ కడనున్నా; 
కనిపెట్టేస్తా మిమ్ము; 
మిత్రులార! అవశ్యం! 
సుదాముడా! 
నిను సైతం ఒడిసి పట్టుకుంటాను!!! ||
;
[మిత్రులు] ;-
కాళిందిలొ పెను నాగు బుసలు కొట్ట;
భీతితోటి యాస్ట పడి
పరుగుల ఉరికొచ్చి మరీ
నీకు పట్టుబడితిమింతేలే క్రిష్ణయ్యా!! ||   
;
ఆ కడ, ఈ కడ ఏ కడనున్నా; 
కనిపెట్టేస్తా నిన్ను చిటికెలోన, 
రాధమ్మా! ఓ రాధమ్మా!  ||  

[చెలులు ] ;-
కడవలలో నీళ్ళు గలగలలాడితె;                                                                                                           దొరికిపోతిమి క్రిష్ణయ్యా! 
;
కడు గడసరివి నీవులే క్రిష్ణయ్యా! 
ఆ మాత్రానికె, ఇంత గీరలు, 
చాలు చాలులే, క్రిష్ణయ్యా!!    
తగ్గు తగ్గుమోయీ! || 
;
 ఆ కడ, ఈ కడ ఏ కడనున్నా; 
కనిపెట్టేస్తా మిము భామినులారా!!  
;
[చెలులు ] ;- 
మా - సిగపూవుల తావులతో 
దొరికిపోయినాములే!
అది నీ గొప్ప కాదు లేవయ్యా!
చాలించు నీదు డాబులు, క్రిష్ణయ్యా!! ||  

***************************; 
 clouds come 









;         [రచన: కుసుమాంబ1955] 
                      [6:16 PM సెప్టెంబర్ 8/29/2015]
బాలకృష్ణ దాగుడుమాతలు ;- [f. b. :- భావుక ] 
------------------------------

No comments:

Post a Comment