Monday, October 12, 2015

"వజ్రబంధము"- song గణపతి సచ్చిదానందస్వామి

శ్రీమతి కుసుమా పిడూరి గారు వజ్రబంధమను గణపతి సచ్చిదానందమునివర్యుల కన్నడములోని ఒక పాటగుఱించి అడిగారు. 
కన్నడ మాతృక, అదే అమరికలో నా తెలుగు అనువాదమును అందిస్తున్నాను. ఈ పాటను కూడ అదే మెట్టులో పాడుకొనవచ్చును.
ఇందులో మొదటి తొమ్మిది పంక్తులలో ఒకటినుండి తొమ్మిది అక్షరములు ఉన్నాయి. తొమ్మిదినుండి పదిహేడవ పంక్తులలో తొమ్మిదినుండి ఒక అక్షరమువఱకు ఉన్నాయి. అనగా మొదటి అర్ధములో స్రోతోవాహయతి (నది ఎలా విశాలమవుతుందో ఆ విధముగా), తఱువాతి అక్షరాలు గోపుచ్ఛయతిలో (ఆవు తోకలా వెడల్పునుండి సన్నగా అవడము) ఉన్నాయి. ఇలాటివి దీక్షితులవారు రచించారు.:- 

శ్రీ
కృష్ణా 
గోపాలా 
ముకుందన
కాణబేకెంబ 
నన హంబలవు
కనసినలి కండె
కణమరెయాదనవ
కృష్ణనే సచ్చిదానందను
దీనవరకర నవ
ననగె నీనే గతి
భక్త వత్సలనే
నన్నస్వామి నీ
జయవెందె
నిన్నయ
లీలె
గె
శ్రీ
కృష్ణ 
గోపాలా 
ముకుందుని 
కాన నెంచంగ 
నగు కోరికను 
కల నడుమ గంటి 
కనుమఱు గయ్యె గద
కృష్ణుడే సచ్చిదానందుడు 
దీనవరదు డతడు
ఎపుడు నీవే గతి
భక్తవత్సలుడా 
నాదు స్వామి నీ
జయ మంటి 
నీదగు 
లీల 
కు
*********************************;

[ విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు ] { F.B. Group - సాహిత్యం [ 8:30 AM 10/1/2015]}

"వజ్రబంధము"- song గణపతి సచ్చిదానందమునివర్యులు
*********************************;
  taramgamulu 

,

No comments:

Post a Comment