Wednesday, May 11, 2016

సీతాకోక చిలక, तितली


బటర్ ఫ్లై! బటర్ ఫ్లై! 
నీ రెక్కలపైన విరజిమ్మెను రంగులెన్నొ ; 
ఆ నీలి ఆకాశం;
నీ రెక్కల పైన ఆరబోసినది వన్నెలెన్నొ ; 
ఈ విశాల వసుంధర! 
;
లోకాన పూజలెన్నొ జరుగుతున్నవి ; 
పత్రి, పూలు, అత్తరులు ; 
క్రొవ్వొత్తి, గుగ్గిలాలు ; అగరు ఒత్తులు;
ధూప దీప సేవా నైవేద్యాల రీతులెన్నెన్నో!
తన పూజల సమము కావు, ఎంచి చూడగా!
;
ప్రశ్న : ఎవరి పూజలు? 
                    మించుట ఎట్లాగ?
జవాబు ;- వన్నెలెన్నొ నింపుకున్న 
                    రెక్కలను ఆడిస్తూ;
                       భువి అంతట తిరిగేను సీతకోక! 
వన్నె రెక్క రెపరెపలతొ ;
ప్రతి లిప్త అందించును ;
అగణితమౌ  అర్చనలను ;
నిఖిల విశ్వాలకు ఈ సర్వ ప్రకృతికి. ;
సీతమ్మకు ఇష్టమైన చిలక కాని చిలకమ్మ!
ఈ సీతాకోక చిలకమ్మ!
కనుకనే నొక్కి మరీ చెబుతున్నా,
तितली రెపరెప పూజలు మిన్నయే
అన్నిటికన్నా!
తక్కిన అన్నింటికన్నా! 
;
=====================================,
# baTar phlai! baTar phlai! 
nii rekkalapaina wirajimmenu ramgulenno ; 
aa neeli aakaaSam;
nii rekkala paina aarabOsinadi wannelenno ; 
ii wiSAla wasumdhara! ;;;
lOkaana puujalenno ; jarugutunnawi ; 
patri, puulu, attarulu ; kro wwotti, 

guggilaalu ; agaru ottulu;
dhuupa deepa sEwaa naiwEdyaala reetulennennO! ;;;;;;;
tana puujala samamu kaawu, emchi chUDagA! ;;;;;
praSna : ewari puujalu? mimchuTa eTlaaga?
jawaabu ;- wannelenno nimpukunna rekkalanu ; aaDistuu;
bhuwi amtaTa tiriEnu seetakOka! 
wanne rekka reparepalato ; prati lipta 

amdimchunu ; agaNitamau archanalanu ; 
ii prakRtiki. nikhila wiSwaalaku ;
seetammaku ishTamaina chilaka kaani chilakamma! 
ii seetaakOka chilakamma!  
kanukanE nokki marii chebutunnaa,
तितली reparepa puujalu minnayE
anniTikannaa! 
takkina annimTikannaa! 

[ तितली /titilee ] #

**********************************************,

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 65745 pageviews - 1043 posts, last published on May 7, 2016 -

అఖిలవనిత
Pageview chart 35756 pageviews - 849 posts, last published on May 7, 2016 -

తెలుగురత్నమాలిక
Pageview chart 5375 pageviews - 152 posts, last published on May 6, 2016  

No comments:

Post a Comment