Thursday, May 26, 2016

రాధా నవ మాలికలు [ song 2 ]

కదలక మెదలక కూర్చొనరా; 
ఇంపుగ నీకు సిగను చుట్టెదను ; 
సుద్దులు చెప్పుతు నే ;
సింగారించెద నిను ముద్దుల కన్నయ్యా!  ||    
కుదురుగ నీవు కూర్చుని ఉంటే
వెన్నపూసలను మరిన్ని ఇస్తా!
తిన్నగ నాసాభరణము పెడతా!   
మోహన క్రిష్ణయ్యా! సమ్మోహన క్రిష్ణయ్యా!  ||   
మకుటము కుదురుగ ఉండనీయరా! 
ఆపై దేనిని ముడువమందువు?  
మొగలిరేకులా? మల్లెపూవులా? 
సందడి చేసే కేకి పింఛమా? || 
;
నీదు – నుదురున హుషారు షికారు  చేసే ; 
ముంగురుల సౌరును ; సరుదమదువా?  
అలకల మెల్లగ తీర్చిదిద్దుదును; 
ఇందుకు ఏమి పొందిక నుండును? --- 
తొందర చేసే రాధ హృదయమా? 
ఈ జానపదుల కనకాంబరగీతి భణితులా? || 
;
=======================================,

raadhaa nawa maalikalu  [ song 2 ] 
;
kadalaka medalaka kuurchonaraa; 
impuga niiku siganu chuTTedanu ; 
suddulu chepputu nE ;
simgaarimcheda ninu muddula kannayyA!  ||   
kuduruga neewu kuurchuni umTE
wennapuusalanu marinni istaa!
tinnaga naasaaBaraNamu peDataa!   
mOhana krishNayyA! sammOhana krishNayyA!  ||   
makuTamu kuduruga umDanIyaraa! 
Apai dEnini muDuwamamduwu?  
mogali rEkulaa!? mallepuuwulaa?
;
samdaDi chEsE kEki pimCamA? ||  ;  
niidu – nuduruna hushaaru shikaaru  chEsE ; 
mumgurula saurunu ; sarudamaduwaa? ; 
alakala mellaga tiirchididdudunu; 
imduku Emi pomdika numDunu? --- 
tomdara chEsE raadha hRdayamA? 
I jaanapadula kanakaambaragiiti bhaNitulA? ||
;

No comments:

Post a Comment