Sunday, July 31, 2016

తెలిసెను కదా!

ఔనులే! వాని మాటలన్నీ నీటి ;
మూటలులే! తెలిసెనులే!ఈనాడు!   ||ఔనులే||
;
"నింగిలోని చుక్కలన్నిటి
నేరుకొనవె రాధికా!" 
అన్నాడే గిరిధారి!   ||ఔనులే||
;
తన కన్నుల పాపలలో ;
తళుకులీను తారకలను ;
నా కన్నులలో చూపుచు,
అన్నాడే, రసమూర్తి!   ||ఔనులే||
;
"అందరాని చందమామ ;
అందుకొనవె ప్రేయసీ!"
అన్నాడే వగలాడు!   ||ఔనులే||
;
నీలి యమున తరగలలో ;
జాబిల్లి చిందేటి ;
వెన్నెల అలలను ; 
నా పైన వెదజల్లుచు 
పలికేను, వనమాలి!   ||ఔనులే||
;
"కుంజవనపు ఛాయలందున ; 
కలిసెదమీ వేళ." 
అన్నాడే మోహనుడు!
;
తను చేసినబాసలను ; 
చిరుగాలికి వదిలేసి ; 
గోపికలతో వలపులలో 
మునిగె, చూడు నేస్తమా!  ||ఔనులే||

==============================,
;
aunulE! waani mATalannI nITi ; 
mUTalulE! telisenulE!iinADu!   ||aunulE||
;
"nimgilOni chukkalanniTi 
nErukonawe rAdhikA!" 
annADE giridhaari!   ||aunulE||
;
tana kannula paapalalO ; 
taLukuliinu taarakalanu ; 
naa kannulalO chUpuchu, 
annADE, rasamuurti!   ||aunulE|| 
;
"amdaraani chamdamaama ; 
amdukonawe prEyasI!" 
annADE wagalADu!   ||aunulE|| 
;
neeli yamuna taragalalO ;
jaabilli chimdETi ; 
wennela alalanu ; 
naa paina wedajalluchu 
palikEnu, wanamaali!   ||aunulE||
;
"kumjawanapu CAyalamduna ; 
kalisedami ii wELa." 
annADE mOhanuDu!
;
tanu chEsina baasalanu ; 
chirugaaliki wadilEsi ; 
gOpikalatO walapulalO munige, 
chUDu nEstamA!   ||aunulE||
;
తెలిసెను కదా!   [పాట 51 ; బుక్ పేజీ  57 ]

No comments:

Post a Comment