Thursday, September 1, 2016

ఇప్పుడే అర్ధమైనది!

ఎన్నెన్నో పరిణామములు ; 
ఎటుల సంభవించినవో ; 
ఇపుడె మాకు అర్ధమైనది ఓ  రాధికా!!
;
జాలువారుచున్నవి
విరజాజుల పరిమళాలు ; 
సుమ సుగంధాల రాశి వీవు కదా!
అందులకే - సుర పుష్పం, 
సౌగందికాననములు చిన్నబోవుచుండెను!  :    ||
;
వెన్నెల పరదాల వెనుక ;
మోములను దాచుకొనుచునెను ;
బ్రహ్మ సృష్టి అందాలు,
స్వర్గ సిరుల చందాలు 
ఇపుడె మాకు అర్ధమాయె రాధికా!! :    ||
;
చతుర్దశ భువనమ్ముల
సోయగాలు యావత్తూ ; 
నీ దేహం మిసిమి చిన్నెలను
అరువుగా గొనెను - అని మాకు ; 
ఇపుడె అర్ధమైనది ఓ రాధికా!!!  !  :    ||
=============================== ;
;
                       ippude ardhamainadi! ;-

ennennO pariNAmamulu ;
eTula sambhawimchinawO ; 
ipuDe maaku ardhamaayenO ;   ||   
;
jaaluwaaruchunnawi
wirajaajula parimaLAlu ; 
suma sugamdhaala raaSi niiwu
aitiweewu amdulakE,; raadhikaa!
sura pushpam,
saugamdikaananamulu
chinnabOwu chumDenu!!  :    ||
;
wennela paradaala wenuka ;
mOmulanu daachukonu chunnawi ; 
brahma sRshTi amdaalu,
swarga sirula chamdaalu!;
ipuDe maaku ardhamaayenO raadhikaa!    :    ||
;
chaturdaSa bhuwanammula
sOyagaalu yaawattuu ;
niidu dEham misimi chinnelanu ; 
aruwugaa goninawi - ani maaku
ipuDe ardhamaaye nO  రాధికా!!  
;
;;; # new song # ;- కుసుమాంబ  1955  ;-    kusumaamba 1955 ;-  

No comments:

Post a Comment