Saturday, October 1, 2016

డోలనమెంతో కనువిందు

డోలనమెంతో కనువిందు ; 
కనగా కనగా 
సౌందర్యముల మకరందపు విందు  ;   
షడ్రస రోచిస్సుల అక్షయ విందు ;   
               || డోలనమెంతో కనువిందు ||
ఉంగా ఉంగా 
ఉగ్గుపాల నురుగుల ప్రోగులు ; 
చొంగల బురుగుల 
అటునిటు ఆడుతు ఇంద్రధనుసుల ; 
ఊయెల  ఊపులు
               || డోలనమెంతో కనువిందు ||
;
నుదుట కస్తూరి ఘుమఘుమలు ; 
మృగమద తిలకమునందున ; 
ప్రభా కిరణముల ఊయెల 
డోలన ఆభరణ కాంతులు  
               || డోలనమెంతో కనువిందు ||
;
==============================;
;
DOlanamemtO kanuwimdu ; 
kanagaa kanagaa 
saumdaryamula makaramdapu wimdu ; 
shaDrasa rOchissula akshaya wimdu ;   || 

umgaa umgaa 
uggupaala nurugula prOgulu ; 
chomgala burugula 
aTuniTu aaDutu imdradhanusula ; 
uuyela  uupulu || 
;
nuduTa kastuuri ghumaghumalu ; 
mRgamada tilakamunamduna ; 
prabhaa kiraNamula 

uuyela DOlana aabharaNa kaamtulu    ||  ; 
;
*********************************;

No comments:

Post a Comment