Tuesday, October 4, 2016

అన్నులమిన్న

వందనములు, వందనములు,  ; 
వందలాది  వందనములు, 
అరవిందలోచనుడా! 
అరమోడ్పు కన్నుల రాధ చేసేటి ;  ||వందనములు||
;
చందనములు, చందనములు; 
చల్లని హరి చందనములు ; 
కందర్పమోహన! 
కెందలిరాకు మోవి రాధ అలదేటి ;  ||చందనములు||
;
మాలికలు మాలికలు ; 
చక్కని పూ మాలికలు ; 
రాధా హృత్ వనమాlee! 
ఈ రాగ సుధా మానస మర్పించే  ||మాలికలు||  
;
వెన్నపాలు, వెన్నపాలు ; 
కమ్మనైన వెన్నపాలు ; 
వెన్నదొంగకు నేడిటు ; 
అన్నులమిన్న రాధ ; 
ఒసగు నవనీతపు విన్నపాలు ;  ||వందనములు||  
;
=========================,
;
             annulaminna ;- 

wamdanamulu,  wamdanamulu,
wamdalaadi  wamdanamulu, 
arawimdalOchanuDA! 
aramODpu kannula raadha chEsETi;  ||wamdanamulu||
;
chamdanamulu, chamdanamulu; 
challani hari chamdanamulu; 
kamdarpamOhana! 
kemdaliraaku mOwi raadha aladETi;  ||chamdanamulu||
;
maalikalu maalikalu; 
chakkani puu maalikalu; 
raadhaa hRt wanamaali! 
I raaga sudhaa maanasa marpimchE  ||maalikalu||  
;
wennapaalu, wennapaalu; 
kammanaina wennapaalu; 
wennadomgaku nEDiTu; 
annulaminna raadha; 
osagu nawaneetapu winnapaalu ;  ||wamdanamulu||  
;
[ పాట 61 ; బుక్ పేజీ 66  , శ్రీకృష్ణగీతాలు ]   

No comments:

Post a Comment