Thursday, October 6, 2016

ప్రశ్నలు వేయరే!

రాధ ఒంటరిదంటు పంచభూతములార! 
అంచెలంచెల మీద ; 
తుంటరి గోవింద గోపాల క్రిష్ణునికి ఇపుడు ; 
             రయ రయమున తెలుపరే!!
               గోముగా ; సత్వరము తెలుపరే! :   || 
;
రాధా వేణీ మేఘమాలికలు ; 
నీలమేఘ వినీలశ్యాముని ; 
స్పర్శకు అయినా నోచ లేదనీ ; 
హేళన ఎందులకే? 
   ఓ పూర్ణిమావరణ రజనీకాంతా!? : 
       అవహేళన ఎందులకే? :   ||  
;
రాధిక మువ్వల రవళికి తోడుగ ; 
తన మురళీరవము లేదేమంటూ ; 
అడగండే, ఆ వేణువినోదుని ; 
ఓ కువలయ వలయ తోయములార! :   || 
;
"రాధిక కరముల కౌగిలి చెరసాల 
ఇపుడు , 
శూన్యముగాను ఉన్నదేమ"నీ -  
అడగండే నిలదీసి గట్టిగా ; ||
తెలుపండే ఆ కుంజవిహారికి ; 
ఓ లతా నికుంజ కింజల్కములార! :   ||  
;
=================================,
;
         praSnalu wEyarE! ;- 
;
raadha omTaridamTu pamchaBUtamulAra! 
amchelamchela meeda ; 
tumTri gOwimda gOpaala krishNuniki ipuDu ; 
    raya rayamuna  teluparE! : 
      gOmugaa satwaramu teluparE! :   || 
;
raadhaa wENI mEGamaalikalu ; 
neelamEGa wineelaSyAmuni ; 
sparSaku ayinA nOcha 
lEdanii ; 
hELana emdulakE? 
O pUrNimAwaraNa rajanIkAmtaa!? ;
awahELana emdulakE? :   || 
;
raadhika muwwala rawaLiki tODuga ; 
tana muraLIrawamu lEdEmamTU ; 
aDagamDE, aa wENuwinOduni ; 
O kuwalaya walaya tOyamulaara! :   || 
;
raadhika karamulakaugili cherasaala 
ipuDu ; 
SUnyamugaanu unnadEmanii -  
aDagamDE niladeesi gaTTigaa ; 
telupamDE aa kumjawihaariki ; 
O lataa nikumja kimjalkamulaara! :   || 

- [  పాట 71 ; బుక్ పేజీ 76  ;  శ్రీకృష్ణగీతాలు  ] ;

No comments:

Post a Comment