Tuesday, October 4, 2016

వెన్నెల అలలు

నంద గోప కువలయావృతేందుబింబమా! 
కుందరదన చాల కుందుచున్నది ;
ఈ రాధిక నీ కొరకై ; 
కుంజవనమునందు చాల కుందుచున్నది ; 
నికుంజ వనమునందు సొమ్మసిలెను!
                   తాను సొమ్మసిలెను!  ;    
రా! రా! రా! 
   రా! రా! రా!  ;   ||నందగోప|| 
;
ముక్కెర ముద్దిడు వెన్నెల అలలలోన ; 
ఉక్కిరి బిక్కిరి ఔతున్నదిరా,  రా! రా! ; 
మువ్వల మ్రొక్కెడు యమునా నీరమ్మును ; 
త్రోసి వేయుచున్నదిరా
ఆవలకు త్రోసి వేయుచున్నదిరా :  
రా! రా! రా! 
   రా! రా! రా!  ;   ||నందగోప|| 
;
కన్నుల కాంతుల దూరెడు మిన్నుకు ; 
రెప్ప తలుపులను వేసి, మూయుచున్నదిరా! 
రా! రా! రా! 
   రా! రా! రా!  ;   ||నందగోప|| 
;
ఎన్నడు ఏ క్షణమందున ;
 వచ్చెదవో యనుకొని ;
    నీవు వచ్చెదవో యనుకొని ;: 
తన మానసపురిలోన - ముగ్గులేయుచున్నది ;
వన్నెచిన్నెలూరు ముగ్గులెన్నొ వేయుచున్నది
రా! రా! రా! 
   రా! రా! రా!  ;   ||నందగోప|| 
;
====================;
 ;
                wennela alalu ;-  
 ; 
namda gOpa kuwalayaawRtEmdubimbamA!
kumdaradana, ii raadhika nii korakai ; 
kumjawanamunamdu chaala kumduchunnadi ; 
nikumja wanamunamdu taanu sommasilenu! ;   
     raa! raa!  raa! 
          raa!raa! raa!;    ||namdagOpa||  
;
mukkera muddiDu wennela alalalOna ; 
ukkiri bikkiri autunnadiraa,  raa! raa! ; 
muwwala mrokkeDu yamunA nIrammunu ; 
aawalaku trOsi wEyuchunnadiraa : raa! raa! 
     raa! raa!  raa! 
          raa!raa! raa!;    ||namdagOpa|| 
;
kannula kaamtula duureDu minnuku; 
reppa talupulanu wEsi, mUyuchunnadirA! raa! ;
     raa! raa!  raa! 
          raa!raa! raa!;    ||namdagOpa|| 
;
ennaDu e kshanamamdu nIwu - wachchedawO yanuchu ;
tanadu mAnasapurilO - muggulEyuchunnadi
wannechinneluuru muggulenno wEyuchunnadiraa! 
           raa! raa!  raa! 
                raa!raa! raa!;    ||namdagOpa|| 

*************************************;
 ; [ పాట  65 ; బుక్ పేజీ  70 ]    శ్రీకృష్ణగీతాలు ; 
8:28 PM 9/19/2016  రాధామనోహర ; copy there ; link ;

No comments:

Post a Comment