Thursday, October 6, 2016

సోగ కన్నులు

నీ గానములో రాగమునై  ; 
నాట్యములో లయ ధృతినై ; 
లీనమౌదురా, రాసవిహారీ! రమణీయమూర్తీ! :     || 
;
 అధరముపై నగవునై ; 
చిరు నగవులోని చలువనై ; 
నీదు మందహాములకు ; 
"మందహాసమునై"* వెలసి యుందురా! :     || 
;
వేణువుపై వ్రేలునై : 
చివురు వ్రేలులోని చెలువమై : 
నీదు సోగ కన్నుదోయి : 
కాటుక కోటగ మారి నిలిచిపోదురా! :     ||   
;
@@@@@@@ 
*"మందహాసము"  = 
పూజ గదిలో భగవంతుని ఆసనము / 
సింహాసనము ; 
;
============================,
;
                  sOga kannulu ;- 
;
nee gaanamulO raagamunai ;
nATyamulO laya dhRtinai ; 
leenamauduraa, 
raasawihaaree! ramaNIyamuurtI! :     || 
;
adharamupai nagawunai ; 
chiru nagawulOni chaluwanai ; 
needu mamdahaamulaku ; 
"mamdahAsamunai"* welasi yumduraa! :     || 
;
wENuwupai wrElunai : 
chiwuru wrElulOni cheluwamai : 
nIdu sOga kannudOyi : 
kATuka kOTaga mAri nilichipOdurA! :     || 
;
  [ పాట  69 ; బుక్ పేజీ 74  , శ్రీకృష్ణగీతాలు ]

No comments:

Post a Comment