Thursday, November 10, 2016

హర్ష డోలిక

రాధిక రాగ మధు జలములకు ;
నీవేరా ఆలవాలము ;
రాధిక హర్షానంద డోలలకు ;
              నీవేరా ఆధారమువు ;
                    రా! రా! రాసవిహారీ!
రాస క్రీడల వేళాయెనురా! :  ||
;
రస రాజు జలాలు ఆడుచుండగా ;
యమునమ్మ తరియించెనమ్మా!
ఎంతటి భాగ్యము దానిది!? - అనుచును ;
"సుర గంగ"- ఈసున చాల ఉరికేనులే! :  ||
;
శిఖిపింఛధారి శిరసు పైన ఎక్కి ;
బర్హి పింఛము చిలిపిగా నవ్వేను ;
ఎంతటి గర్వము దానికి - అనుచును;
అరవిందములు బల్ అక్కసుతో నక్కినవి:  ||
;
======================================;
;
                       harsha DOlika ;-
raadhika raaga madhu jalamulaku ;
neewErA AlawAlamu ;
raadhika harshaanamda DOlalaku ;
neewEArA aadhaaramuwu ;
       rA! rA! rAsawihaarI!
         raasa krIDala wELAye :   ||
rasa raaju jalaalu ADuchumDagA ;
yamunamma tariyimchenammA!
emtaTi BAgyamu dAnidi!? - anuchunu ;
"sura gamga"- Isuna chAla urikEnulE! :  ||
;
SiKipimCadhAri Sirasu paina ekki ;
barhi pimCamu chilipigaa nawwEnu ;
emtaTi garwamu dAniki - anuchunu;
arawimdamulu bal akkasutO nakkinawi:  ||

No comments:

Post a Comment