Monday, December 5, 2016

చెలియా!

రాధ ;- రాకేందు లోచనుడెందు దాగేనే? ; 
చెలికత్తె ;- రాధా హృదిలో, తెలుసును లేవే!; 
;
రాధ ;- 
కృష్ణుని తలపులు 
నిండిన డెందపు తలుపులు 
తెరచి ఉంచితిని ; 
రానే లేదే రాసలోలుడు ; 
     ఇంకా రానే లేదే రాసలోలుడు ; || 
రాధ :- 
అల్లరి కృష్ణుడు అల్లన మొయిలులో ; 
దాగి ఉండేనేమొ!? 
పట్టున దెటులో తెలుపగ రాదే!? ;
చెలి ;- 
నల్లని వానిని, అల్లరి వానిని ; 
కారుమొయిలులో ; పట్టగ నగునా 
నుడువవె చటుకున, ఓ రాధా! 

రాధ ;- చల్లల నమ్మెడు గొల్లకాంతల ; 
కొంగులలోనా దాగెనొ, ఏమో? 
పట్టగ రాదే? ఓ చెలియా! ;; 
;
చెలి - 
చెంగు చెంగున ఆడే గోవిందుని - 
చెంగుల వెనుక, వెదుకగలమటే, ఓ రాధా! ''' 

అటు నిటు వెదుకగ నేలమ్మా! 
నింగిని నేలను అంతట తానై ; 
అగుపించెడు వాడు మేఘ శ్యాముడు ;
;
నీ మనసు డోలలలొ ఉండెను లేవే! 
  జగముల నేలే ఆ గోవిందుడు : 
     ఈ రాధా మాధవ రస స్వరూపమే 
            నిశ్చయముగా ఓ రాధా!   
;
=================================;
;
                 cheliyA! :- 
;
rAdha- raakEmdu lOchanuDemdu daagEnE? ; 
chelikatte ;- rAdhaa hRdilO, telusunu lEwE!; 
;
rAdha ;- 
kRshNuni talapulu 
nimDina Demdapu talupulu 
terachi umchitini ; 
rAnE lEdE rAsalOluDu ; 
     imkaa rAnE lEdE rAsalOluDu ; || 
rAdha :- 
allari kRshNuDu allana moyilulO ; 
daagi umDEnEmo!? 
paTTuna deTulO telupaga raadE!? ;
cheli ;- 
nallani waanini, allari waanini ; 
kaarumoyilulO ; paTTaga nagunA 
nuDuwawe chaTukuna, O rAdhaa! 

rAdha ;- challala nammeDu gollakaamtala ; 
komgulalOnaa daageno, EmO? 
paTTaga raadE? O cheliyA! ;; 
;
cheli - 
chemgu chemguna ADE gOwimduni - 
chemgula wenuka, wedukagalamaTE, O rAdhaa! ''' 

aTu niTu wedukaga nElammaa! 
nimgini nElanu amtaTa taanai ; 
agupimcheDu wADu mEgha SyAmuDu ;''''' 
;
nee manasu DOlalalo umDenu lEwE! 
jagamula nElE aa gOwimduDu : 
I rAdhaa maadhawa rasa swaruupamE 
        niSchayamugA O rAdhaa! #  
;
[ పాట 96 ; బుక్ పేజీ 101 , శ్రీకృష్ణగీతాలు ] ;

No comments:

Post a Comment