Monday, December 5, 2016

నీ తలపులు

విరిసిన పూవులలో ముసిరెను తావులు ; 
మురిసిన తావులలో కురిసెను వెన్నెలలు ; 
కొసరిన వెన్నెలలో తడిసెను భావములు ; 
తనిసిన భావమలో నీ రూపే, 
              కృష్ణా! నీ రూపే ;   || 
;
రాలిన పత్ర, పుష్పాలను ఓదార్చెను భూ పరాగం ; 
ఎగసిన సింధూరమా శిఖరములకు తెలిపెనురా ; 
"వగకాడు గోపాలుడు నేడు చూడు!; 
ఈ గోపిని విరహాగ్నిని వేచేనని! వేగించేనని!" ;  || 
;
రాలిన ఒక తారక 'నిల' దాచినది- తన ఒడిని ; 
వగచిన సాగరపు టలలు నీరదమ్ములకు తెలిపెను ; 
"వగలమారి మా మురారి కరగని శిలయే! 
ఈ గోపిని "కన్నీటి కడలి"ని ముంచేనని ;  || 

 ======================================;

                       nii talapulu ;-
;
wirisina puuwulalO musirenu taawulu ; 
murisina taawulalO kurisenu wennelalu ; 
kosarina wennelalO taDisenu BAwamulu ; 
tanisina BAwamalO nI ruupE, 
              kRshNA! nI ruupE ;   || 
;
raalina patra, pushpaalanu OdArchenu BU parAgam ; 
egasina simdhuuramaa SiKaramulaku telipenuraa ; 
"wagakADu gOpAluDu nEDu chUDu!; 
I gOpini wirahAgnini wEchEnani! wEgimchEnani!" ;  || 
;
raalina oka taaraka 'nila ' daachinadi- tana oDini ; 
wagachina saagarapu Talalu niiradammulaku telipenu ; 
"wagalamAri mA murAri karagani SilayE! 
I gOpini "kannITi kaDali"ni mumchEnani ;  || 

[ పాట 95 ; బుక్ పేజీ 100  , శ్రీకృష్ణగీతాలు ]

No comments:

Post a Comment