Thursday, December 29, 2016

అల్లరులలో మేటి వాడు

నందకిశోరుడు, క్రిష్ణుడు ; 
బలరామునికి తమ్ముడు,
పింఛధారి, గోవర్ధన గిరిధారి, 
అల్లరులలో మేటి వాడు ; || 
;
రోహిణీ పిన్నమ్మ, యశోదమ్మలు; 
నవనీతమ్ములు, జున్ను, మీగడలు ; ; 
కొసరి కొసరి ఇస్తేను తీసుకున్నాడు ; 
తీసుకున్నాడు, సరే!;
పుచ్చుకున్న క్రిష్ణుడు ఎటు వెళ్ళినాడమ్మా!? ;
క్రిష్ణుడు ఎటు వెళ్ళినాడమ్మా!? ||
;
యమునా దరి చేరాడు ముద్దుగుమ్మడు ; 
చిరు తిళ్ళు తెచ్చారు కన్నయ్య నేస్తాలు, 
గోపెమ్మలు, రాధమ్మలు ;
కొంగులలో దాచి దాచి తెచ్చారు ; ||
;
తినుబండారములతోటి 
సరగున వచ్చేసారు మిత్రులు, 
ఇదిగొ సర్వం నీకేను! - అంటుంటే ; 
'కాకి ఎంగిలిలు చేసి చేస్తే - 
తనకు బాగా పనికివచ్చును, 
సరి సరి! సరే సరే!!
;
;- అల్లరులలో మేటి వాడు ; blogillu LINK

No comments:

Post a Comment