Wednesday, April 12, 2017

పాల చిందులకు సంగీతం

మధురానగరిలొ – 
నగరికి వెడలితి వనితామణులు ;
లలనల నడుముల పాలకుండలు ;  
పెరుగు, తక్రం, పాల చిందులు ; 
పాల తొణుకుల సవ్వడులన్నియు ; 
సరిగమ పదని – సప్త స్వరముల  
          సుభగత్వం వింతగ వింతలు ; 
            వంతులు వంతులు – భళీ భళీ! :  || 
;
క్షీరాంబుధిని కాపురముండి , 
వసుధకు విచ్చేసిన వాడు ; 
మునుపు విష్ణువు ఓయమ్మా! 
పాల కడలి వాసునికి ;
    పాలు అన్నచో ఎంతో ప్రీతి
        సహజమే  ఓయమ్మా! ;     ||   
;
పల్లె పడుచుల శిరసున మోసే –
దుత్తల పాలకు సంగీతమును నేర్పిస్తున్నది ; 
క్రిష్ణ మురళీ రవళి ; అందులకే కద ఓ యమ్మా! 
అది పూర్వ జన్మ స్నేహ బంధముల 
      కలబోతల  ఫలితం- తెలియగ, ఓ యమ్మా!  || 

No comments:

Post a Comment