Sunday, October 1, 2017

చూపిన తర్జని నందలాల

అణువణువు ప్రకృతి ;
మనుగడకు అదె కృతి ;
మానవాళికి తథ్యమీ
నిత్య ఫలశృతి - నందలాల ;  ||
;
ఆరుబయలున చాల ;
ఆలమందలు గాచి ;
పని సోమరులకు నీవు ;
చూపిన తర్జని నందలాల ;  ||
;
మొండి గుర్రాలను ;
మచ్చికలు చేసేసి ;
ఐనావు రణమున ;
తేరుకు సారధి నందలాల ;  ||
;
నిలువెత్తు తార్కాణ
మీవె కార్యమ్ముల ;
చాటితివి జగతికి ;
లక్ష్య సిద్ధిని సూటి నందలాల ;  ||
;
జనని గీసిన గీటును దాటనంటూనే -
లోకముల కొసగావు -
మేటి భగవద్ గీత, నందలాల ;
భళి భళీ ఆనందలాల ;
;
అణువణువు ప్రకృతి ;
మనుగడకు అదె కృతి ;
మరపు రానీయవు ;
మానవాళికి తథ్యమీ
నిత్య ఫలశృతి నందలాల ;

అందించినావు కద నందలాల ;  ||  
;
=======================;
;
aNuwaNuwu prakRti ;
manugaDaku ade kRti ;
maanawALiki tathyamee
nitya phalaSRti  నందలాల;  ||
;
aarubayaluna caala ;
aalamamdalu gaaci ;
pani sOmarulaku neewu ;
cuupina tarjani నందలాల ;  ||
;
momDi gurraalanu ;
maccikalu cEsEsi ;
ainaawu raNamuna ;
tEruku saaradhi నందలాల ;  ||
;
niluwettu taarkaaNa
meewe kaaryammula ;
caaTitiwi jagatiki ;
lakshya siddhini suuTi నందలాల ;  ||
;
aNuwaNuwu prakRti ;
manugaDaku ade kRti ;
marapu raaneeyawu ;
maanawALiki tathyamee
nitya phalaSRti  నందలాల
amdimcinaawu kada నందలాల ;  || ;
;

No comments:

Post a Comment